e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

ఒక్కో సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం

నేరాల నియంత్రణలో నిఘా వ్యవస్థ కీలకం: డీఎస్పీ సంపత్‌రావు

మొగుళ్లపల్లి, మన భారత్: గ్రామాల్లో ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు నేరాలను నియంత్రించేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు అన్నారు. శుక్రవారం మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన 15 సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను ఆయన ప్రారంభించారు.

ఎస్సై ముప్పు సురేష్ సూచనల మేరకు గ్రామ సర్పంచ్ నరహరి వెంకట్‌రెడ్డి నేతృత్వంలో గ్రామ ప్రముఖులు, ప్రజల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు విరాళాలు సేకరించారు. సేకరించిన నిధులతో గ్రామంలోని ముఖ్య కూడళ్లను కవర్ చేసేలా 15 కెమెరాలను ఏర్పాటు చేశారు. డీఎస్పీ సంపత్‌రావు రిబ్బన్‌ కట్‌ చేసి నిఘా వ్యవస్థను ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో గ్రామంలో జరిగే సంఘటనలను పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. దొంగతనాలు, ఇతర నేరాలను అరికట్టడంతో పాటు అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు దర్యాప్తులో సీసీ కెమెరాల దృశ్యాలు ఉపయోగపడతాయని వివరించారు. ప్రజల భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అనంతరం మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువత, ప్రజలకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల యువత విద్య, ఉద్యోగం, కుటుంబ జీవితం వంటి ముఖ్యమైన అంశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు వంటి సానుకూల కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు.

తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, స్నేహాలు, రోజువారీ కార్యకలాపాలపై తగిన శ్రద్ధ వహించాలని కోరారు. విద్యార్థులు మత్తు పదార్థాల వైపు ఆకర్షితులు కాకుండా పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేస్తే యువతను చెడు అలవాట్లకు దూరంగా ఉంచేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

మొగుళ్లపల్లి మండలంలోని ఇతర గ్రామాల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాటుకు అవగాహన కల్పిస్తూ ఎస్సై ముప్పు సురేష్ చేస్తున్న కృషిని డీఎస్పీ అభినందించారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు సమకూర్చుకుని భద్రత కోసం కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ప్రజల భద్రత కోసం పోలీసులతో కలిసి ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో చిట్యాల సీఐ సతీష్, ఎస్సై ముప్పు సురేష్, సర్పంచ్ నరహరి వెంకట్‌రెడ్డి, గ్రామ ప్రముఖులు, యువత, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE