e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

ప్రభుత్వ పాఠశాలకు ‘బీరువా’ విరాళం..

ప్రభుత్వ పాఠశాలకు ‘బీరువా’ విరాళం: మిత్రుని పుట్టినరోజు వేళ రాజు రెడ్డి ఉదారత
మన భారత్, సెప్టెంబర్18, తలమడుగు:
పుట్టినరోజు అంటే కేవలం వేడుకలు చేసుకోవడమే కాదు, సమాజానికి ఉపయోగపడే మంచి పని చేయాలని నిరూపించారు హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన ప్రముఖ వాస్తవ్యులు శ్రీ రాజు రెడ్డి. తలమడుగు మండలంలోని కప్పరదేవి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (MPPS) ప్రధానోపాధ్యాయులు శ్రీ ప్రపూల్ చందర్ రెడ్డి పదో తరగతి స్నేహితుడైన రాజు రెడ్డి, తన పుట్టినరోజైన 18 సెప్టెంబర్ 2026 నాడు పాఠశాలకు ఒక స్టీల్ బీరువాను కానుకగా విరాళంగా అందించారు. మిత్రుడిపై ఉన్న గౌరవంతో పాటు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు రికార్డుల భద్రత కోసం ఈ వస్తువు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆయన ఈ ఉదారతను చాటుకున్నారు.
పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ విరాళం అందజేత కార్యక్రమంలో మండల విద్యాధికారి (MEO) శ్రీ వెంకట్ రావ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొంత ఊరు కాకపోయినా, స్నేహితుడు పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రాజు రెడ్డి గారు ముందుకు రావడం ఎంతో అభినందనీయమన్నారు. ఇలాంటి దాతల సహకారం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ప్రపూల్ చందర్ రెడ్డి గారు తన పదో తరగతి మిత్రుడు రాజు రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. ఈ విద్యాసంవత్సరంలో పాఠశాల రికార్డులను భద్రపరుచుకోవడానికి బీరువా ఎంతో అవసరమని, సరైన సమయంలో మిత్రుడు ఈ గిఫ్ట్ అందించడం ఆనందంగా ఉందన్నారు.

ఈ సేవా కార్యక్రమంలో పాఠశాల విలేజ్ ఆర్గనైజేషన్ (VO) ప్రతినిధి లలిత మేడం, మాజీ సర్పంచ్ జంగు బాయి మేడం, వార్డు మెంబర్ సరస్వతి మేడం, పాఠశాల ఉపాధ్యాయురాలు పార్వతి మేడం, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు మరియు పాఠశాల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని దాత రాజు రెడ్డిని ఘనంగా సత్కరించారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE