గణపతి మండపాలను సందర్శించిన జిల్లా ఎస్పీ

Published on

-Advertisement-

డీజేలు, లేజర్ లైట్లు, పేపర్ చిల్లే యంత్రాలకు అనుమతి లేదు

ఆదిలాబాద్, సెప్టెంబర్ 17 (మన భారత్): గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలో నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పట్టణంలోని పలు ప్రధాన గణపతి మండపాలను సందర్శించి నిర్వాహకులు, కమిటీ సభ్యులు, యువతతో మాట్లాడారు.

ఎన్టీఆర్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన ప్రింట్ మీడియా గణపతి మండపాన్ని ఎస్పీ సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శాంతినగర్, ఖానాపూర్, గందేవార్ తోట ప్రాంతాల్లోని మండపాలను, టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని క్రాంతినగర్, భాగ్యనగర్, మహాలక్ష్మివాడ ప్రాంతాల్లోని ప్రధాన మండపాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమాలను నిర్ణీత సమయంలో ప్రారంభించి, వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు మండపాల నిర్వాహకులు సహకరించాలని కోరారు. నిమజ్జన మార్గాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ తరఫున అవసరమైన బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఉత్సవాల సందర్భంగా డీజేలు, లేజర్ లైట్లు, పేపర్ చిల్లే యంత్రాలకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించకుండా మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. మండపాల వద్ద భద్రతా చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించినా, అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. అత్యవసర సేవల కోసం డయల్ 100 లేదా 112ను సంప్రదించవచ్చని చెప్పారు.

ప్రజలు, భక్తులు, యువత సంయమనం పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. ఈ సందర్భంగా పలువురు మండపాల కమిటీ సభ్యులు ఎస్పీని సత్కరించారు.

కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్, టూటౌన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ టి. మురళి, పోలీస్ సిబ్బంది, గణపతి మండపాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...

ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు 

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం -మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 20 (మన భారత్): వినాయక నిమజ్జన వేడుకలను...

పద్మశాలి సంఘ భవనంలో గణనాథుడిని దర్శించుకున్న మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష

పద్మశాలి సంఘ భవనంలో గణనాథుడిని దర్శించుకున్న మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష మన భారత్, సెప్టెంబర్20,...

More like this

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...

ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు 

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం -మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 20 (మన భారత్): వినాయక నిమజ్జన వేడుకలను...