డీజేలు లేజర్ లైట్లు పేపర్ చిల్లే యంత్రాలకు అనుమతి లేదు

Published on

-Advertisement-

ప్రశాంత వాతావరణంలో గణపతి నిమజ్జనాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి..

 

ప్రధాన గణపతి మండపాలను సందర్శించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

మన భారత్, సెప్టెంబర్ 16, ఆదిలాబాద్: గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంతో పాటు గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గణపతి మండపాల నిర్వాహకులకు సూచించారు. ఉత్సవాల సందర్భంగా యువతతో పోలీసులు నేరుగా మమేకమై ప్రజలు, పోలీసుల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఆదిలాబాద్ పట్టణంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పలు ప్రధాన గణపతి మండపాలను సందర్శించారు. కూలిపుర, వినాయక్ చౌక్ ప్రాంతాల్లోని గణపతి మండపాలను ప్రత్యేకంగా దర్శించి స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండపాల వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు, యువతతో నేరుగా మాట్లాడి ఉత్సవాల నిర్వహణ, భద్రతా చర్యలు, నిమజ్జన ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు.

నిమజ్జనం సకాలంలో పూర్తి చేయాలి

గణపతి నిమజ్జన కార్యక్రమాలను ఆలస్యం చేయకుండా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఎస్పీ సూచించారు. నిమజ్జన ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ తరఫున పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు, గణపతి మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించి నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు.

డీజేలు, లేజర్ లైట్లకు అనుమతి లేదు

నిమజ్జన ఉత్సవాల సందర్భంగా డీజేలు, లేజర్ లైట్లు, పేపర్ చిల్లే యంత్రాలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ఉత్సవ కమిటీ సభ్యులు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మండపాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

గణపతి మండపాల వద్ద భద్రతను మరింత పటిష్టం చేసేందుకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఉత్సవాల సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులను సంప్రదించాలని సూచించారు.

ఐదు మండపాలను సందర్శించిన ఎస్పీ

జిల్లా ఎస్పీ పట్టణంలోని దాదాపు ఐదు ప్రధాన గణపతి మండపాలను సందర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండపాల నిర్వాహకులు ఎస్పీ అఖిల్ మహాజన్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా యువతతో నేరుగా మాట్లాడిన ఎస్పీ.. ఉత్సవాలను క్రమశిక్షణతో, సామరస్యపూర్వకంగా నిర్వహించుకోవాలని సూచించారు.

ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, గణపతి నవరాత్రి ఉత్సవాలు మరియు నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా పోలీసు యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎస్పీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్, పోలీసు సిబ్బంది, గణపతి మండపాల కమిటీ సభ్యులు, యువత తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

 

Latest articles

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...

ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు 

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం -మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 20 (మన భారత్): వినాయక నిమజ్జన వేడుకలను...

పద్మశాలి సంఘ భవనంలో గణనాథుడిని దర్శించుకున్న మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష

పద్మశాలి సంఘ భవనంలో గణనాథుడిని దర్శించుకున్న మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష మన భారత్, సెప్టెంబర్20,...

More like this

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...

ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు 

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం -మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 20 (మన భారత్): వినాయక నిమజ్జన వేడుకలను...