ఘనంగా వినాయక చవితి పూజలు..

Published on

-Advertisement-

ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా వినాయక చవితి పూజలు

గణనాథునికి తొలి పూజలు నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. జిల్లా ప్రజలకు గణపతి నవరాత్రి శుభాకాంక్షలు

మన భారత్, ఆదిలాబాద్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో గణనాథునికి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ స్వయంగా గణపతి ప్రతిమను ప్రతిష్ఠించి తొలి పూజలు నిర్వహించారు.

వేదమంత్రాలు, భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేకంగా పాల్గొని గణనాథునికి పూజలు, హారతి సమర్పించారు. వినాయకుడి ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, జిల్లావ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు.

పోలీసుల సూచనలు పాటించాలి

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి, గణపతి నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. భక్తులు ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. గణపతి విగ్రహాలను తరలించే సమయంలో నిర్వాహకులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని, పోలీసుశాఖ సూచించిన భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

.ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, పరస్పర సహకారంతో గణపతి నవరాత్రి వేడుకలను ఆనందోత్సాహాలతో నిర్వహించాలని తెలిపారు

ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన వినాయక చవితి పూజా కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి. సురేందర్ రావు, డీఎస్పీలు ఎల్. జీవన్ రెడ్డి, ఎం. వెంకట నర్సయ్య, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు డి. వెంకటి, టి. మురళి, ఎన్. చంద్రశేఖర్, పట్టణ సీఐలు, ఎస్‌ఐలు, రిజర్వ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది సమక్షంలో భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ పూజా కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి 

Latest articles

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...

ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు 

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం -మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 20 (మన భారత్): వినాయక నిమజ్జన వేడుకలను...

పద్మశాలి సంఘ భవనంలో గణనాథుడిని దర్శించుకున్న మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష

పద్మశాలి సంఘ భవనంలో గణనాథుడిని దర్శించుకున్న మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష మన భారత్, సెప్టెంబర్20,...

More like this

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...

ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు 

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం -మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 20 (మన భారత్): వినాయక నిమజ్జన వేడుకలను...