ఘనంగా పొలాల అమావాస్య వేడుకలు

Published on

-Advertisement-

జైనథ్‌లో ఘనంగా పొలాల అమావాస్య వేడుకలు

మన భారత్, సెప్టెంబర్10, జైనథ్: రైతులు, ప్రజలకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పొలాల అమావాస్య శుభాకాంక్షలు తెలిపారు. జైనథ్ మండల కేంద్రంలో గురువారం పొలాల అమావాస్య వేడుకలను రైతులు, గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

జైనథ్‌లోని లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం రైతులు సంప్రదాయబద్ధంగా అలంకరించిన ఎడ్లను పరిశీలిస్తూ వేడుకల్లో పాల్గొన్నారు.

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక పొలాల అమావాస్య

పొలాల అమావాస్యను రైతులు కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకోవడం మన సంస్కృతి, సాంప్రదాయాల గొప్పతనానికి ప్రతీకగా నిలుస్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఐక్యంగా, ఆనందోత్సాహాలతో పండుగను నిర్వహించడం అభినందనీయమన్నారు

మన పూర్వీకుల నుంచి కొనసాగుతున్న సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల ప్రాధాన్యతను భావితరాలకు తెలియజేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. సంప్రదాయ పండుగలను ఘనంగా నిర్వహించడం ద్వారా యువతకు మన సంస్కృతి, వ్యవసాయ జీవన విధానంపై అవగాహన కలుగుతుందని తెలిపారు.

పశువులను గౌరవించడం మన సంప్రదాయం

వ్యవసాయ రంగంలో రైతులకు పశువులు, ముఖ్యంగా ఎడ్లు ఎంతోకాలంగా కీలకంగా సహకరిస్తున్నాయని ఎస్పీ పేర్కొన్నారు. రైతుల వ్యవసాయ పనుల్లో తోడ్పడే పశువులను గౌరవించి పూజించడం మన సంప్రదాయంలో భాగమని అన్నారు. రైతులు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, పశుసంపద ఆరోగ్యంగా వృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఎడ్లను అత్యంత ఆకర్షణీయంగా, ప్రత్యేకంగా అలంకరించిన రైతులకు గ్రామపంచాయతీ తరఫున ప్రకటించిన బహుమతులను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అందజేశారు. బహుమతులు అందుకున్న రైతులను అభినందించి, సంప్రదాయాలను కాపాడుతూ పండుగలను నిర్వహించాలని సూచించారు.

వేడుకల్లో రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో జైనథ్ మండల కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, జైనథ్ ఎస్ఐ పి. గౌతమ్, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

తెలంగాణ ఉద్యమ ధీరుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఘన నివాళి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాటం.. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతర కృషి మన భారత్‌,...

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...

ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు 

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం -మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 20 (మన భారత్): వినాయక నిమజ్జన వేడుకలను...

More like this

తెలంగాణ ఉద్యమ ధీరుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఘన నివాళి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాటం.. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతర కృషి మన భారత్‌,...

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...