e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

రంగపూర్ లో సఖి సేవలపై అవగాహన సదస్సు..

మన భారత్,మొగుళ్ళపల్లి:

మొగుల్లపల్లి మండలం రంగపూర్ గ్రామంలో పొక్సో, బాల్య వివాహాలు,పోషణ ,సఖి సేవల పై అవగాహన కార్యక్రమం ,జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా సంక్షేమ అధికారిణి సూచనలతో, సూపర్‌వైజర్ అరుణదేవి ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ శాఖ ద్వారాబాలురు,బాలికలు, మహిళలు , చిన్నారుల పోషణ, ఆరోగ్యం, విద్య, భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెండర్ స్పెషలిస్ట్ అనూష మాట్లాడుతూ, మహిళలు, బాలికల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు చిన్ననాటి నుంచే పౌష్టికాహారం అందించడం ఎంతో అవసరమన్నారు. పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలను నివారించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

1098 హెల్ప్ లైన్ గురించి,బాల్య వివాహాల నివారణ, మత్తు పదార్థాల కి వ్యతిరేకంగా అవగాహన కల్పించారు,సఖి కేంద్రం అడ్మిన్ గాయత్రి గారు మాట్లాడుతూ సఖి సేవల గురించి, 181 హెల్ప్ లైన్ నెంబర్ గురించి ,మహిళలకు ప్రభుత్వం అందించే సేవల గురించి, వరకట్న, గృహహింస, బాధిత మహిళల కోసం, సఖి కేంద్రం ద్వారా సేవలు అందిస్తుందని 5 రోజుల పాటు ఉచితంగా సఖి లో సేవలు అందిస్తాం అని తెలిపారు. వైద్య సహయం, న్యాయ సహాయం,ఉచిత వసతి, కౌన్సిలింగ్, పోలీస్ సహాయం అందిస్తాం అని తెలియచేశారు.

జెండర్ స్పెషలిస్ట్ మమత అంగన్‌వాడీ కేంద్రాలు పోషకాహారం అందించే కేంద్రాలుగా మాత్రమే కాకుండా బాలికల ఆరోగ్యం, హక్కులు, విద్య, భద్రత మరియు సాధికారతకు మార్గదర్శక కేంద్రాలుగా పనిచేయాలని అన్నారు.మిషన్ కోఆర్డినేటర్ క్రిష్ణ చట్టం ముందు అందరం సమానమే అని బాల్య వివాహాల శిక్షలు, పొక్సో చట్టం, వయోవృద్ధుల చట్టం గురించి  14567 గురించి తెలియచేసారు, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అంగన్‌వాడీ సిబ్బంది కృషి చేయాలని తెలిపారు.

బాలికల ఆరోగ్యం, విద్య, భద్రతతో పాటు బాల్యవివాహాల నివారణకు గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.
కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ,పంచాయతీ కార్యదర్శి , అంగన్‌వాడీ టీచర్లు,విద్యార్థులు, గర్భిణీలు, బాలింతలు, బాలికలు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE