ఓటర్ల జాబితా సవరణలో పొరపాట్లకు తావివ్వొద్దు

Published on

-Advertisement-

అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా చర్యలు

మృతులు, శాశ్వత వలసదారుల వివరాలను క్షేత్రస్థాయిలో నిర్ధారించాలి

తాంసిలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలించిన రాష్ట్ర సీఈవో సుదర్శన్‌రెడ్డి

మన భారత్,తాంసి, సెప్టెంబర్ 9: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి పారదర్శకతతో, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి. సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అదే సమయంలో మృతులు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలను క్షేత్రస్థాయిలో పూర్తిగా నిర్ధారించిన తర్వాతే నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు.

బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి తాంసి మండలం ఘోట్కూరి గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని సీఈవో ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే, ఓటర్ల వివరాల ధ్రువీకరణ, దరఖాస్తుల పరిశీలన తదితర ప్రక్రియలను ఆయన స్వయంగా పరిశీలించారు. బీఎల్‌ఓల వద్ద ఉన్న ఓటర్ల జాబితాలు, దరఖాస్తులను తనిఖీ చేసి, కొత్తగా ఓటరుగా నమోదు కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఓటర్ల పేరు, వయస్సు, చిరునామా తదితర వివరాల్లో తప్పులు ఉన్నట్లయితే వాటిని నిబంధనలకు అనుగుణంగా సరిచేయాలని సుదర్శన్‌రెడ్డి సూచించారు. ఇంటింటి సర్వే సందర్భంగా ప్రతి కుటుంబంలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత వ్యక్తుల నుంచి ధ్రువీకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే మార్పులు, చేర్పులు, తొలగింపులు చేపట్టాలని స్పష్టం చేశారు.

పత్రాల పరిశీలన కీలకం

కొన్ని సందర్భాల్లో అవసరమైన పత్రాలు అందుబాటులో లేకపోతే సంబంధిత వ్యక్తులకు తహశీల్దార్లు తగిన మార్గదర్శకాలు అందించాలని సీఈవో సూచించారు. అవసరమైన ధ్రువపత్రాలను సమకూర్చుకునే విధంగా ప్రజలకు సహకరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలు సేకరించిన సమాచారాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం కలెక్టర్ స్థాయిలో ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

గత మూడు రోజులుగా క్షేత్రస్థాయి పరిశీలన కొనసాగుతోందని సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని తెలిపారు. బీఎల్‌ఓలు తమకు అప్పగించిన బాధ్యతలను అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తూ ప్రతి ఓటరు వివరాన్ని సమగ్రంగా పరిశీలించాలని సూచించారు.

యువత నమోదుపై ప్రత్యేక దృష్టి

18 సంవత్సరాలు నిండిన అర్హులైన యువత ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్న ఒక్క యువకుడు కూడా ఓటరు నమోదుకు దూరం కాకుండా అవసరమైన సమాచారం అందించాలని సూచించారు. అలాగే ప్రతి ఓటరు తన పేరు ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఉందో లేదో స్వయంగా పరిశీలించుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు.

ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత, కచ్చితత్వం అత్యంత ముఖ్యమని సీఈవో పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సేకరించిన ప్రతి సమాచారాన్ని బాధ్యతాయుతంగా పరిశీలించి, ఆధారాలు మరియు నిబంధనల మేరకు మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా జాబితాలో నమోదు కాకుండా మిగిలిపోకుండా ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. అదే సమయంలో అనర్హుల పేర్లు కొనసాగకుండా నిబంధనల ప్రకారం పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఆర్‌.ఎస్‌. చిత్రూ, ఎస్‌. రాజేశ్వర్‌, తహశీల్దార్లు గణేష్‌, ఎన్నికల సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలు, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, అధికారులు, సిబ్బంది, ఓటర్లు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

తెలంగాణ ఉద్యమ ధీరుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఘన నివాళి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాటం.. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతర కృషి మన భారత్‌,...

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...

ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు 

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం -మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 20 (మన భారత్): వినాయక నిమజ్జన వేడుకలను...

More like this

తెలంగాణ ఉద్యమ ధీరుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఘన నివాళి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాటం.. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతర కృషి మన భారత్‌,...

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...