సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేయవద్దు: కలెక్టర్ రాజర్షి షా

Published on

-Advertisement-

గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి

అన్ని వర్గాల ప్రజలు సమన్వయంతో పండుగను విజయవంతం చేయాలి

ఆదిలాబాద్:మన భారత్ , సెప్టెంబర్ 8,
గణేష్ నవరాత్రి ఉత్సవాలను గతంలో మాదిరిగానే ఈసారి కూడా అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా, ప్రశాంత వాతావరణంలో అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. పండుగ సందర్భంగా ప్రజల మధ్య సోదరభావం, సామరస్యం కొనసాగించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని మతాల ప్రజలు పరస్పరం సహకరించుకుంటూ పండుగను ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వాహకులు, ప్రజలు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.

సోషల్ మీడియాలో పుకార్లకు దూరంగా ఉండాలి

పండుగల సమయంలో సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం, నిర్ధారణ లేని వార్తలు, పుకార్లు వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రతి సమాచారాన్ని నిజమని నమ్మకుండా, దాని వాస్తవికతను నిర్ధారించుకున్న తర్వాతే స్పందించాలని సూచించారు.

పుకార్లు ప్రజల్లో అనవసర ఆందోళనకు కారణమయ్యే అవకాశం ఉన్నందున వాటిని ప్రచారం చేయడం, ఇతరులకు పంపించడం వంటివి చేయవద్దని కోరారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు అధికారులకు సహకరించాలని ఆయన అన్నారు.

శాఖల మధ్య సమన్వయంతో ఏర్పాట్లు

గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి చిన్న లోపానికీ అవకాశం లేకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖలు తమ పరిధిలోని బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని అన్నారు. ఉత్సవాల సమయంలో ఏర్పడే సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఐక్యతతో గణేష్ ఉత్సవాలకు విజయవంతం

గతంలో మాదిరిగానే ఈసారి కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు సోదరభావం, మత సామరస్యం, ప్రశాంత వాతావరణానికి ప్రతీకగా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు, ఉత్సవ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే పండుగను విజయవంతంగా నిర్వహించవచ్చని తెలిపారు.

ప్రజలు సంయమనం పాటిస్తూ అధికార యంత్రాంగానికి సహకరించాలని, సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ రాజర్షి షా కోరారు.

ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూషతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

తెలంగాణ ఉద్యమ ధీరుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఘన నివాళి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాటం.. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతర కృషి మన భారత్‌,...

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...

ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు 

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం -మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 20 (మన భారత్): వినాయక నిమజ్జన వేడుకలను...

More like this

తెలంగాణ ఉద్యమ ధీరుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఘన నివాళి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాటం.. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతర కృషి మన భారత్‌,...

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...