e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే బర్తరఫ్ చేయాలి

-కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు నడిగోటి రాము

మన భారత్, మొగుళ్ళపల్లి:

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత, అవమానకర వ్యాఖ్యలను భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు నడిగోటి రాము తీవ్రంగా ఖండించారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత గౌరవప్రదమైన పదవుల్లో ఒకటైన అసెంబ్లీ స్పీకర్ పదవిని కించపరిచే విధంగా మాట్లాడటం బీఆర్ఎస్ నాయకుల అహంకారానికి, బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజ్యాంగబద్ధమైన పదవుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందని స్పష్టం చేశారు.అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనను తీవ్రంగా ఖండించి, ఎమ్మెల్సీ తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని నడిగోటి రాము డిమాండ్ చేశారు.

ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా హుందాతనంతో వ్యవహరించాలని, భవిష్యత్తులో రాజ్యాంగబద్ధమైన పదవులపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE