బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే బర్తరఫ్ చేయాలి
-కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు నడిగోటి రాము మన భారత్, మొగుళ్ళపల్లి: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత, అవమానకర వ్యాఖ్యలను భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు నడిగోటి రాము తీవ్రంగా ఖండించారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత గౌరవప్రదమైన పదవుల్లో ఒకటైన అసెంబ్లీ స్పీకర్ పదవిని కించపరిచే విధంగా మాట్లాడటం బీఆర్ఎస్ నాయకుల అహంకారానికి, బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవుల...