బీఆర్ఎస్ పోరుబాట.. విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి

Published on

-Advertisement-

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ పోరుబాట.. ఇచ్చోడ విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి

రైతుల సమస్యలపై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నిరసన.. వంటా వార్పుతో ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం

మన భారత్, సెప్టెంబర్4, గుడిహత్నూర్: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో ఇచ్చోడ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. అనంతరం సబ్‌స్టేషన్ ఎదుట వంటా వార్పు నిర్వహించి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.

వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం కరెంట్ కోతలతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విమర్శించారు.

రైతులతో కలిసి వినూత్న నిరసన

విద్యుత్ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తే రైతులపై అదనపు భారం పడుతుందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రైతులతో కలిసి ఉరి తాళ్లను ప్రదర్శిస్తూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. మోటార్లకు మీటర్లు పెడితే రైతులకు మిగిలేది ఉరేననే సందేశంతో ఈ నిరసన చేపట్టినట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు.

రైతుల హామీలను అమలు చేయాలని డిమాండ్

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ముఖ్యంగా వ్యవసాయానికి కీలకమైన విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ప్రజల ఇబ్బందులపై తగిన స్థాయిలో స్పందించడం లేదని విమర్శించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేశామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు.

రైతులకు ఇబ్బందులు కలిగించే నిర్ణయాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, వ్యవసాయానికి నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ ప్రజల తరఫున నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి .

Latest articles

తెలంగాణ ఉద్యమ ధీరుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఘన నివాళి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాటం.. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతర కృషి మన భారత్‌,...

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...

ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు 

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం -మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 20 (మన భారత్): వినాయక నిమజ్జన వేడుకలను...

More like this

తెలంగాణ ఉద్యమ ధీరుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఘన నివాళి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాటం.. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతర కృషి మన భారత్‌,...

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...