అంగన్వాడీ లో చిన్నారులకు యూనిఫాంలు..

Published on

-Advertisement-

కోసాయి అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు యూనిఫాం దుస్తుల పంపిణీ

తలమాడుగు:మన భారత్ ఆగస్టు 12, అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మెరుగైన వాతావరణం కల్పించడంతో పాటు వారి సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా కోసాయి అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు యూనిఫాం దుస్తులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సిడాం శైలజ రవి చిన్నారులకు యూనిఫాం దుస్తులను అందజేశారు. చిన్నారులు క్రమశిక్షణతో అంగన్‌వాడీ కేంద్రానికి హాజరై, అందుతున్న పౌష్టికాహారం, ప్రీ-స్కూల్ విద్య, ఇతర సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్త మెస్రం కమల పాల్గొని చిన్నారుల విద్య, ఆరోగ్యం, పోషణకు సంబంధించిన అంశాలను వివరించారు. అంగన్‌వాడీ కేంద్రం ద్వారా చిన్నారులకు అందుతున్న సేవలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

చిన్నారులకు యూనిఫాం దుస్తులు అందడంతో వారు, వారి తల్లులు సంతోషం వ్యక్తం చేశారు. పిల్లల సంక్షేమానికి అవసరమైన కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని తల్లులు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లులు పాల్గొని యూనిఫాం దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

ఆ గ్రామానికి జిల్లా కలెక్టర్ పేరు..!

ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ...

ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు

ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్...

532 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం..

ఎండు గంజాయి స్వాధీనం మొగుళ్లపల్లి, ఆగస్టు 13: అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్న యువకుడిని మొగుళ్లపల్లి పోలీసులు అరెస్టు చేసి,...

More like this