e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

ఘనంగా తల్లిపాల వారోత్సవాలు ..

మన భారత్,మొగుళ్ళపల్లి.

తల్లి తన బిడ్డకు ఇవ్వగలిగే మొట్టమొదటి. అత్యంత విలువైన కానుక పుట్టిన వెంటనే ముర్రుపాలు,తల్లిపాలు ఇవ్వడమేననీ ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణాదేవి అన్నారు. సోమవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలో రైతు వేదికలో ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణాదేవి ఆధ్వర్యంలో ఆగస్టు ఒకటి నుంచి ఏడో తేదీ వరకు నిర్వహించనున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాల గురించి అంగన్వాడి సెంటర్స్ పరిధిలోని గర్భిణీలకు బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏడాది సుస్థిరమైన జీవితం ప్రారంభానికి తల్లిపాలు–ఫలితాలను ఇచ్చే చర్యలను మరింత బలోపేతం చేయడం అనే థీమ్ తో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. అంగన్వాడి వైద్య ఆరోగ్య శాఖ , సిబ్బంది సమన్వయంతో మొగుళ్ళపల్లి మండలంలోని ప్రతి గ్రామంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు.

గర్భిణీలు, బాలింతలు , కుటుంబ సభ్యులకు ప్రాముఖ్యత సరైన శిశు పోషణ పై అవగాహన కల్పించి ప్రతి చిన్నారికి ఆరోగ్యవంతమైన జీవనానికి పునాది వేయాలని ఆమె సూచించారు.

కార్యక్రమంలో సర్పంచ్ చాట్ల విజయ, ఉప సర్పంచ్ ఎర్రబెల్లి హిమాబిందు, వార్డు సభ్యులు , గ్రామ కార్యదర్శి నరేష్, అంగన్వాడీ టీచర్స్, వెన్నెల ,కవిత శ్రీమాత,రజిత ,స్వప్న, అనిత, ఏఎన్ఎం శ్రీలత, ఆశాలు, సిఏలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్, మన భారత్, జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE