రాష్ట్ర ప్రభుత్వ జీపీ ఫర్ హోమ్స్ మహేష్ రాజేకు ఘన సన్మానం

Published on

-Advertisement-

మన భారత్ | నారాయణపేట: 

నారాయణపేటకు విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ జీపీ ఫర్ హోమ్స్, హైకోర్టు న్యాయవాది మహేష్ రాజేను కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పసుపులలోని దత్తక్షేత్రంలో శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనానికి వెళ్తూ వ్యక్తిగత పనుల నిమిత్తం నారాయణపేటకు వచ్చిన మహేష్ రాజేను స్థానిక న్యాయవాది కోటకొండ సీతారామారావు నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా నారాయణపేట ఛత్రపతి విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ తరఫున మహేష్ రాజేకు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటాన్ని బహుకరించి ఘనంగా సత్కరించారు. న్యాయరంగంలో ఆయన అందిస్తున్న సేవలను కొనియాడుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం కొత్త కలెక్టరేట్ కాంప్లెక్స్ సమీపంలో విస్తరించి ఉన్న తిరుమల ట్రేడర్స్ లేఅవుట్‌కు సంబంధించిన ప్లాట్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహేష్ రాజేతో చర్చించారు. ప్లాట్ యజమానుల తరఫున సమస్యలను వివరించి, వాటి పరిష్కారానికి అవసరమైన న్యాయపరమైన చర్యలపై ఆయన సలహాలు కోరినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ యాదవ్, సీనియర్ న్యాయవాది కోటకొండ సీతారామారావు, హైకోర్టు న్యాయవాది గజ్జల శ్రీనివాస్‌తో పాటు పలువురు న్యాయవాదులు, ప్రముఖులు పాల్గొన్నారు. న్యాయరంగానికి సంబంధించిన పలు అంశాలపై కూడా వారు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు.

మీ జిల్లాలో స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి

Latest articles

తెలంగాణ రక్షణ సేన పార్టీలో భారీ చేరికలు..

గెర్జామ్‌లో 300 మంది పార్టీలో చేరిక.. కండువాలు కప్పి ఆహ్వానించిన రాథోడ్ బాపురావు మన భారత్, బోథ్:ఆగస్టు 26: బోథ్ నియోజకవర్గంలో తెలంగాణ...

మోసం చేసిన నిందితుడి అరెస్టు..

ఆటో డ్రైవర్‌ను మాటల్లో పెట్టి ఫోన్‌పే ద్వారా రూ.17 వేలు కాజేత మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో...

ఫ్రీ కుట్టు మెషీన్లు.. మీరు దరఖాస్తు చేసుకున్నారా.?

ఫ్రీగా కుట్టు మెషీన్లు.. బీసీ మహిళలు దరఖాస్తు చేసుకున్నారా? మన భారత్, ఆగస్టు ,25: బీసీ మహిళలకు స్వయం ఉపాధి...

పర్యావరణాన్ని కాపాడండి: సర్పంచ్ వెంకన్న

కుచులాపూర్‌లో మొక్కలు నాటిన సర్పంచ్ మోడేపు వెంకన్న మన భారత్, ఆగస్టు,25, తలమడుగు: పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామంలో పచ్చదనాన్ని...

More like this