రాష్ట్ర ప్రభుత్వ జీపీ ఫర్ హోమ్స్ మహేష్ రాజేకు ఘన సన్మానం
మన భారత్ | నారాయణపేట: నారాయణపేటకు విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ జీపీ ఫర్ హోమ్స్, హైకోర్టు న్యాయవాది మహేష్ రాజేను కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పసుపులలోని దత్తక్షేత్రంలో శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనానికి వెళ్తూ వ్యక్తిగత పనుల నిమిత్తం నారాయణపేటకు వచ్చిన మహేష్ రాజేను స్థానిక న్యాయవాది కోటకొండ సీతారామారావు నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణపేట ఛత్రపతి విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ తరఫున మహేష్ రాజేకు ఛత్రపతి...