కుచులాపూర్‌లో మొక్కలు నాటిన సర్పంచ్ మోడేపు వెంకన్న
మన భారత్, ఆగస్టు,25, తలమడుగు: పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తలమడుగు మండలం కుచులాపూర్ గ్రామంలో వన మహోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ మోడేపు వెంకన్న మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మోడేపు వెంకన్న మాట్లాడుతూ చెట్ల పెంపకం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రతి కుటుంబం తమ ఇంటి పరిసర ప్రాంతంలో కనీసం ఒక్క మొక్కనైనా నాటి, దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం వల్ల భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, పచ్చని వాతావరణం అందించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు దోహదపడుతుందని తెలిపారు.
ప్రస్తుత కాలంలో పర్యావరణ పరిరక్షణకు చెట్ల ప్రాధాన్యత ఎంతో ఉందని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా ముఖ్యమని సర్పంచ్ పేర్కొన్నారు. రేపటి సమాజానికి చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ తెలుసుకుని, ఆచరణలో పెట్టాలని సూచించారు. గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు గ్రామస్థుల సహకారం అవసరమని కోరారు.
వన మహోత్సవాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని, ప్రతి ఇంటి వద్ద, ప్రభుత్వ స్థలాల్లో, పాఠశాలల పరిసరాల్లో మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని గ్రామస్థులకు సూచించారు. చిన్న వయసు నుంచే విద్యార్థుల్లో మొక్కల సంరక్షణపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోడేపు వెంకన్నతో పాటు గ్రామస్తులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. నాటిన మొక్కలను క్రమం తప్పకుండా సంరక్షించాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
