నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్.!

Published on

-Advertisement-

రూయ్యడి నుంచి నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్.. మహిళపై కేసు నమోదు – ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి: డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి

మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రూయ్యడి గ్రామంలో నాలుగేళ్ల చిన్నారి అదృశ్యం కావడం కలకలం రేపింది. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఓ మహిళ చిన్నారిని గ్రామం నుంచి ఆదిలాబాద్ పట్టణానికి తీసుకెళ్లి బస్టాండ్ ప్రాంతంలో ఇతరులకు అప్పగించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తలమడుగు పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తెలిపారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తలమడుగు మండలం రూయ్యడి గ్రామానికి చెందిన నైతం నాగుబాయి అనే మహిళ సోమవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన నాలుగేళ్ల మైనర్ బాలిక ఆత్రం గంగామణి ని కుటుంబ సభ్యులకు తెలియకుండా తన వెంట తీసుకెళ్లింది. అనంతరం ఆదిలాబాద్ పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులకు చిన్నారిని అప్పగించినట్లు సమాచారం.

చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురై గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం చిన్నారి తల్లి ఆత్రం కప్లిబాయి తలమడుగు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితురాలిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.

డీఎస్పీ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం పాషా, తలమడుగు ఎస్ఐ డి. రాధిక, రూరల్ ఎస్ఐ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ ప్రధాన బస్టాండ్, తాంసి బస్టాండ్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించగా, నిందితురాలు చిన్నారితో కలిసి సంచరిస్తున్న దృశ్యాలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆధారాలపై దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.

అదృశ్యమైన చిన్నారి ఆత్రం గంగామణికి నాలుగు సంవత్సరాల వయస్సు ఉంటుందని, ఆమెకు కోలాం భాషతో పాటు కొద్దిగా తెలుగు మాట్లాడడం వస్తుందని పోలీసులు తెలిపారు. చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతి అందజేస్తామని డీఎస్పీ ప్రకటించారు.

చిన్నారి ఎక్కడైనా కనిపించినా లేదా ఆమెకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు, డయల్–100కు లేదా కింది నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలను కోరారు.

తలమడుగు ఎస్ఐ: 8712659928

ఆదిలాబాద్ రూరల్ సీఐ: 8712659915

 ఆదిలాబాద్ డీఎస్పీ: 8712659914

చిన్నారిని సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించే దిశగా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి చిన్నారి ఆచూకీపై సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి..

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాలు వారిగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

తల్లిదండ్రుల చెంతకు చిన్నారి..

ఆరు గంటల్లో చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆదిలాబాద్ పోలీసులు బాధలో ఉన్న కుటుంబానికి ఊరట పోలీసుల వేగవంతమైన...

నకిలీ జాయినింగ్ లెటర్లతో భారీ మోసం..

మన భారత్ | ఆదిలాబాద్ ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో రూ.70 లక్షల జాబ్ ఫ్రాడ్.. నలుగురు అరెస్ట్ 25 మందికి పైగా...

రోడ్లపై పశువులు వదిలితే కఠిన చర్యలు..

మన భారత్ | ఆదిలాబాద్ ఆదిలాబాద్‌లో పోలీస్–మున్సిపల్ సంయుక్త స్పెషల్ డ్రైవ్ ఆదిలాబాద్, జూలై 28 (మన భారత్): ప్రజల ప్రాణ...

నూతన పోస్ట్ ఆఫీస్ ప్రారంభం..

మన భారత్ | తలమడుగు రుయ్యాడి గ్రామంలో నూతన తపాలా కార్యాలయం ప్రారంభం.. గ్రామపంచాయతీ భవనంలో సేవలు ప్రారంభం తలమడుగు, జూలై...

More like this

తల్లిదండ్రుల చెంతకు చిన్నారి..

ఆరు గంటల్లో చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆదిలాబాద్ పోలీసులు బాధలో ఉన్న కుటుంబానికి ఊరట పోలీసుల వేగవంతమైన...

నకిలీ జాయినింగ్ లెటర్లతో భారీ మోసం..

మన భారత్ | ఆదిలాబాద్ ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో రూ.70 లక్షల జాబ్ ఫ్రాడ్.. నలుగురు అరెస్ట్ 25 మందికి పైగా...

రోడ్లపై పశువులు వదిలితే కఠిన చర్యలు..

మన భారత్ | ఆదిలాబాద్ ఆదిలాబాద్‌లో పోలీస్–మున్సిపల్ సంయుక్త స్పెషల్ డ్రైవ్ ఆదిలాబాద్, జూలై 28 (మన భారత్): ప్రజల ప్రాణ...