కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి..
-రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ రెడ్డి
మన భారత్, మొగుళ్ళపల్లి:
విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ ను రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ రెడ్డి యార ఖండించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేయడం అత్యంత దురదృష్టకరం ,ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం.
ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. విద్యార్థులపై లాఠీచార్జ్‌కు కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. గాయపడిన విద్యార్థులకు తక్షణ వైద్య సహాయం అందించి, వారికి న్యాయం చేయాలి.విద్యార్థుల గొంతును అణిచివేయడం కాకుండా, వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.
