రూ.1.80 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం

Published on

-Advertisement-

మొగుళ్లపల్లి మండలంలో రూ.1.80 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

మన భారత్,మొగుళ్ళపల్లి:

భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి మండలంలో పలు గ్రామాల్లో రూ.1.80 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మొగుళ్లపల్లి మండలంలోని కొరికిశాల, ఎల్లారెడ్డిపల్లి, మొగుళ్లపల్లి గ్రామాల్లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద మంజూరైన నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలోని ఇతర మండలాలతో పోలిస్తే మొగుళ్లపల్లి మండలం అభివృద్ధిలో కొంత వెనుకబడి ఉందని, అందుకే ఈ మండల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అత్యధిక నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, మౌలిక వసతుల కల్పనతో పాటు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొగుళ్లపల్లి మండలానికి కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించలేకపోయారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొగుళ్లపల్లి మండల ప్రజల అవసరాలను గుర్తించి అంబులెన్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం.. 

ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌దే అధికారం: కృష్ణ రత్న ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోంది తాంసి నుంచి బోథ్ ధర్నాకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్...

19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ సైబర్ మోసం 19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు...

ఆ నలుగురు అరెస్ట్.!

గుప్త నిధుల పేరుతో మోసానికి యత్నం.. నలుగురు అరెస్ట్ ఉట్నూర్ కోటలో తవ్వకాలకు ప్రయత్నం.. వీడియోలతో ప్రజలను నమ్మించే యత్నం 4...

More like this