e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

“అమ్మ పేరుతో ఒక మొక్క” నాటిన నేతలు

మన భారత్, గజపతినగరం

“అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన నేతలు

గజపతినగరం, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత ప్రధానమంత్రి Narendra Modi పిలుపు మేరకు “అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమాన్ని గజపతినగరంలో ఘనంగా నిర్వహించారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు P. V. N. Madhav , జిల్లా అధ్యక్షులు Uppalapati Rajesh Varma సూచనల మేరకు, గజపతినగరం మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు మేటికోటి భాస్కరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రెడ్డి పావని గజపతినగరం మెంటాడ రోడ్డు రైల్వే గేట్ సమీపంలో ఐదు మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు.

అనంతరం నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలను స్థానిక పెద్దలకు అప్పగించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని నాయకులు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఆరిశెట్టి ఏడుకొండలు, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు దొగ్గ దేవుడు, జిల్లా ఎస్సీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ పొగిరి గౌరీ, మండల ఉపాధ్యక్షులు వేమన సత్యనారాయణ, తవిటి నాయుడు, మిత్తిపాటి ఈశ్వరరావు, జాగారపు తౌడు, జయంతి ప్రకాష్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE