కార్మికుల వేతనాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం

Published on

-Advertisement-

హామీలు అమలు చేయకపోతే సమ్మె తప్పదన్న సీఐటీయూ నేతలు

మన భారత్ | నాగర్ కర్నూల్ జిల్లా

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న కార్మికుల వేతనాల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని సీఐటీయూ జిల్లా కోశాధికారి పొదిల రామయ్య విమర్శించారు. మూడు నెలలుగా వేతనాలు చెల్లించకుండా కార్మికులను పనులు చేయించడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన గ్రామపంచాయతీ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలోని 12,572 గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులు జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచుతామని, సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. సమ్మెల సమయంలో కార్మికులకు మద్దతుగా మాట్లాడిన నాయకులు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు.

అలాగే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన మల్టీపర్పస్ విధానం కారణంగా గ్రామపంచాయతీ కార్మికులపై అదనపు భారం పడిందని, చేయని పనులు కూడా వారితో చేయిస్తున్నారని మండిపడ్డారు. ఒక నెల జీతం ఆలస్యమైనా ఉద్యోగులు ఇబ్బంది పడుతుంటే, మూడు నెలలుగా వేతనాలు లేక గ్రామపంచాయతీ కార్మికుల కుటుంబాలు ఎలా జీవించాలనే పరిస్థితి నెలకొందని అన్నారు.

గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం కొత్తగా ఎన్నికైన కొంతమంది సర్పంచులు, ఉపసర్పంచులు, సెక్రటరీలు పాత కార్మికులను తొలగించి కొత్తవారిని నియమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీని వల్ల కార్మికులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు.

ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలు విడుదల చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, అక్రమ తొలగింపులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం జూలై 1న మండల కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆందోళనలను విజయవంతం చేయడానికి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే జూలై 8న జిల్లా కలెక్టరేట్ల దిగ్భంధనం చేపడతామని, అనంతరం జూలై 20 తర్వాత నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ, కురుమయ్య, శాంతయ్య, కృష్ణయ్య, బాలస్వామి, వెంకటయ్య, శివ, అశోక్, నాగయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయాలి..

మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామపంచాయతీ ,మొగుళ్ళపల్లి రైతు వేదికలో వ్యవసాయ అధికారి సురేందర్...

పాఠశాలలో కంటైనర్ టాయిలెట్స్ ప్రారంభం

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ చే...

భక్తులకు మహా అన్నప్రసాద వితరణ..

మొగుళ్లపల్లి ముదిరాజ్ యువజన సంఘం యూత్ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నప్రసాద వితరణ మన భారత్,మొగుళ్ళపల్లి: శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా...

గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం అవసరం

గుండాల గోండు గూడలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం.. ఉచిత వైద్య శిబిరం యువతకు క్రీడా కిట్లు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల...

More like this

సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయాలి..

మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామపంచాయతీ ,మొగుళ్ళపల్లి రైతు వేదికలో వ్యవసాయ అధికారి సురేందర్...

పాఠశాలలో కంటైనర్ టాయిలెట్స్ ప్రారంభం

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ చే...

భక్తులకు మహా అన్నప్రసాద వితరణ..

మొగుళ్లపల్లి ముదిరాజ్ యువజన సంఘం యూత్ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నప్రసాద వితరణ మన భారత్,మొగుళ్ళపల్లి: శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా...