బీసీలకు ద్రోహం చేస్తున్న బీజేపీ..

Published on

-Advertisement-

మన భారత్, మొగుళ్లపల్లి

బీసీలకు ద్రోహం చేస్తున్న బీజేపీకి రాజకీయ పతనం తప్పదు: వేముల మహేందర్ గౌడ్

జనగణనలో కులగణన చేయడానికి అభ్యంతరం ఏంటి? అంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బీసీలకు అన్యాయం చేస్తున్న బీజేపీకి రాజకీయ పతనం తప్పదని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడీ బీసీ ప్రధాని అని చెప్పుకుంటూనే, బీసీల హక్కులను విస్మరిస్తున్నారని మండిపడ్డారు.

దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు జనగణనలో సమగ్ర కులగణన నిర్వహించకపోవడం ద్వారా బీసీలను మోసం చేసిందని ఆరోపించారు. దేశ జనాభాలో అధిక శాతం బీసీలే ఉన్నారని, వారికి రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉద్యోగ రంగాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన కులగణనను ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. భవిష్యత్తులో బీసీలంతా ఏకమై బీజేపీకి గట్టి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

బీజేపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు బీసీల పట్ల వ్యతిరేక వైఖరే కొనసాగుతోందని, మండల్ ఉద్యమం నుంచి కులగణన ఉద్యమం వరకు అదే ధోరణి కొనసాగుతోందని అన్నారు. ప్రజాస్వామ్యంలో మెజార్టీ ప్రజల ఆకాంక్షలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి ..

Latest articles

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

విడుదలైన నీట్ ఫలితాలు..

విడుదలైన నీట్ ఫలితాలు -ప్రభంజనం సృష్టించిన మోషన్ కాలేజీ విద్యార్థులు విద్యార్థులను అభినందించిన మోషన్ కాలేజ్ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మన...

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

More like this