మే లో కూతురి పెళ్లి.. తండ్రి ఆత్మహత్య

Published on

-Advertisement-

మన భారత్ ,ఆదిలాబాద్ :

ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారంతో పాటు కూతురి పెళ్లి బాధ్యతలు మోస్తూ తీవ్ర మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బేల మండలంలోని పాఠన్ గ్రామంలో వెలుగుచూసింది.

గ్రామానికి చెందిన రైతు లస్మారెడ్డి (49) సాగులో సరైన దిగుబడి రాకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మానసికంగా తీవ్రంగా కలత చెందుతున్నాడు. ఇదే సమయంలో వచ్చే నెలలో జరగాల్సిన తన కుమార్తె వివాహం కోసం డబ్బు సమీకరించలేకపోవడం అతనికి మరింత భారంగా మారింది.

ఈ పరిస్థితుల్లో తీవ్ర నిరాశకు లోనైన లస్మారెడ్డి మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, రిమ్స్‌కు తీసుకెళ్లేలోపే మృతి చెందినట్లు సమాచారం.

మృతుడి భార్య వెంకటమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా మారాయి.

రైతులపై పెరుగుతున్న అప్పుల భారం, వ్యవసాయంలో అనిశ్చిత పరిస్థితులు మరో ప్రాణాన్ని బలితీసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు కోరుతున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం..

విద్యార్థులపై లాఠీచార్జ్ ,రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం -మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి...

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యం

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలన -సర్పంచ్ నైనకంటి మమత మన భారత్,మొగుళ్ళపల్లి: పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలనను కొనసాగిస్తున్నామని, పల్లెలు...

ఉద్యమకారుల జేఏసీ మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడిగా చదువు అన్నారెడ్డి మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల...

ముగ్గురిపై కేసు నమోదు..

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పర్లపల్లి గ్రామంలో ఎస్ఐ ముప్పు సురేష్ నేతృత్వంలో పోలీస్...

More like this