e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

కాన్వాయ్ ఆపి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

మన భారత్, నాగర్ కర్నూల్

జిల్లా కేంద్రంలో ప్రజలకు దగ్గరగా ఉండే నాయకుడిగా ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. మంత్రిగారి పర్యటనకు వేగంగా వెళ్లాల్సిన సమయంలోనూ, అంబేద్కర్ చౌరస్తాలో ఎదురుచూస్తున్న చిరు వ్యాపారులను గమనించి తన కాన్వాయ్‌ను ఆపి వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.

వ్యాపారులతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే, వారి ఇబ్బందులను శ్రద్ధగా విన్నారు. దాదాపు 30 ఏళ్లుగా అదే ప్రాంతంలో వీధి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, కానీ ఇప్పటికీ సరైన షెడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు వివరించారు. వర్షం, ఎండ సమయంలో రక్షణ లేకపోవడం వల్ల తమ జీవనోపాధి కష్టాల్లో పడుతోందని తెలిపారు.

అదేవిధంగా, డ్రైనేజీ మోరి ఎత్తుగా నిర్మించబడడం వల్ల వ్యాపారం చేసుకోవడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయని, దీనిని తగ్గించి తమకు అనుకూలంగా షెడ్లు ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, సమస్యను సంబంధిత అధికారులతో చర్చించి తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే చర్యలు తీసుకుని వీధి వ్యాపారులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

ఎమ్మెల్యే స్వయంగా వచ్చి సమస్యలు అడిగి తెలుసుకోవడం పట్ల వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై స్పందించే నాయకత్వం ఇదే అని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో వ్యాపారుల సంఘం అధ్యక్షుడు పొదిల రామయ్య, కార్యదర్శి యాదగిరి, అలాగే సాధిక్, ఖాజా, రవీంద్ర, చారి, బంగారయ్య, భాస్కర్, నరసింహ, ఆరిఫ్, సుధాకర్, లక్ష్మయ్య, శశికళ, సుజాత, పద్మ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.


రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE