e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

577 ఉద్యోగాలు.. మే 1 వరకు దరఖాస్తులు

మన భారత్, జాబ్ న్యూస్: 

కేంద్ర ప్రభుత్వానికి చెందిన నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) సంస్థలో వివిధ విభాగాల్లో మొత్తం 577 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు.

ఈ నియామక ప్రక్రియలో డంపర్ ఆపరేటర్, గ్రేడర్ ఆపరేటర్, డోజర్ ఆపరేటర్, సర్ఫేజ్ మైనర్ ఆపరేటర్, స్టాఫ్ నర్స్, ఓవర్సీర్ (సివిల్) వంటి పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు తమ అర్హతల ఆధారంగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో టెన్త్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పోస్టులకు అనుగుణంగా హెవీ మోటార్ వెహికల్ (HMV) లేదా ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్, ఇంటర్, బీఎస్సీ నర్సింగ్ వంటి అర్హతలు అవసరం. స్టాఫ్ నర్స్ పోస్టులకు బీఎస్సీ నర్సింగ్ తప్పనిసరి కాగా, టెక్నికల్ పోస్టులకు సంబంధిత అనుభవం, లైసెన్స్ ఉండాలి.

వయోపరిమితి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపులు వర్తించవచ్చు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల చివరి తేదీ మే 1గా నిర్ణయించారు. కావున అర్హత ఉన్న అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను క్రింద ఉన్న లింక్ క్లిక్ చేసి సందర్శించవచ్చు:
👉 https://www.nclcil.in/

ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ రంగంలో ఉద్యోగం పొందే అవకాశం లభించడం అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.


🔖 మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE