రైతుల బోనస్ సమస్య వెంటనే పరిష్కరించాలి:

Published on

-Advertisement-

మన భారత్, జయశంకర్ భూపాలపల్లి:

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతుల సమస్యలపై కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు రైతులు పాల్గొని తమ సమస్యలను వెల్లడించారు.

రైతులు మాట్లాడుతూ, వర్షాకాలం వరి పంటకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన బోనస్ డబ్బులు ఇప్పటివరకు తమ బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం పలుమార్లు వ్యవసాయ అధికారులను, బ్యాంకులను సంప్రదించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయిందని తెలిపారు. కలెక్టర్‌కు కూడా వినతిపత్రాలు సమర్పించినప్పటికీ స్పందన రాలేదని వాపోయారు.

ఈ విషయంపై స్పందించిన రవి పటేల్, కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల హామీలలో భాగంగా సన్నవల పంటలకు క్వింటాల్‌కు ₹500 బోనస్ ఇస్తామని ప్రకటించి ఇప్పటివరకు అమలు చేయకపోవడం బాధాకరమని విమర్శించారు. రైతులను అధికారుల చుట్టూ తిప్పించడం అన్యాయమని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్, సంబంధిత వ్యవసాయ అధికారులు తక్షణమే స్పందించి రైతుల బోనస్ సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ప్రకృతి ఒడిదుడుకులను ఎదుర్కొని పంట పండించిన రైతులకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని, రైతులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా పార్టీ అండగా ఉంటుందని రవి పటేల్ భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గడువులోగా సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా వ్యాప్తంగా రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని రవి పటేల్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, రైతులు పాల్గొన్నారు.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్

చీపురుపల్లిలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్.. గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్ విజయ కాలనీలో విస్తృత తనిఖీలు.. గంజాయి నిర్మూలనపై...

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ

మన భారత్, ఆదిలాబాద్ గంజాయి, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ రీజోనెన్స్ పాఠశాలలో...

పోలీసుల ఆరోగ్యమే ప్రజల భద్రతకు బలం..

మన భారత్, ఆదిలాబాద్ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ యశోద హాస్పిటల్స్ సహకారంతో...

నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు..

మన భారత్, ఆదిలాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల హాజరు.. 9 మంది ఎంఈవోలకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు సిరికొండ, గుడిహత్నూర్...

More like this

గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్

చీపురుపల్లిలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్.. గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్ విజయ కాలనీలో విస్తృత తనిఖీలు.. గంజాయి నిర్మూలనపై...

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ

మన భారత్, ఆదిలాబాద్ గంజాయి, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ రీజోనెన్స్ పాఠశాలలో...

పోలీసుల ఆరోగ్యమే ప్రజల భద్రతకు బలం..

మన భారత్, ఆదిలాబాద్ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ యశోద హాస్పిటల్స్ సహకారంతో...