దారుణం: అక్రమ సంబంధం.. కన్న పిల్లల హత్య.!

Published on

-Advertisement-

మన భారత్ ,ఆంధ్రప్రదేశ్:

పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే క్షణికావేశం, అక్రమ సంబంధాల కారణంగా వారి ప్రాణాలు తీస్తున్న దారుణ ఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో వెలుగుచూశాయి. ఈ ఘటనలు సమాజాన్ని కలవరపరిచేలా ఉండటమే కాకుండా, మానవత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

తిరుపతి జిల్లాలోని నరసరాజు అగ్రహారంలో చోటుచేసుకున్న ఘటనలో, ఐదు నెలల పసికందు ఏడుస్తోందన్న కారణంతో తల్లి హేమావతి తన కూతురిని హతమార్చినట్లు సమాచారం. అనంతరం భర్తకు ఫోన్ చేసి, ‘నీకో బ్యాడ్ న్యూస్… నాకో గుడ్ న్యూస్… పాపను చంపేశా’ అంటూ చెప్పినట్టు తెలిసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

ఇక మరో ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని త్రిపురాంతకంలో జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించిన తండ్రి, తన 9 ఏళ్ల కూతురు తులసిని హతమార్చినట్లు సమాచారం. ఈ ఘటన కూడా ప్రాంతంలో తీవ్ర ఆందోళనకు దారి తీసింది.

ఈ రెండు ఘటనలు తల్లిదండ్రుల బాధ్యతపై తీవ్రమైన చర్చకు దారితీశాయి. చిన్నారులపై జరుగుతున్న ఇలాంటి దారుణాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Latest articles

మా టీచర్ ను మాకే కావాలని ఎంఈవోకు వినతి

వడ్గావ్ పాఠశాలకు ఉపాధ్యాయుడిని తిరిగి కేటాయించాలి.. -ఎంఈఓకు గ్రామస్తుల వినతి మన భారత్ | ఆదిలాబాద్:  ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని...

ఆ సర్పంచ్ సస్పెండ్ .!

నకిలీ పత్తి విత్తనాల కేసు.. దాబా(బి) సర్పంచ్ సస్పెన్షన్ మన భారత్ | ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల...

వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ..

తలమడుగులో ఆర్టీసీ బస్సు క్లచ్ ప్లేట్లు ఫెయిల్.. వర్షంలో గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ మన భారత్, జూలై 21...

పెరుగుతున్న కరోనా కేసులు..

మాస్క్ ధరించడం మంచిదే: వైద్యుల సూచన మన భారత్ , హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో...

More like this