హిరో రాం చరణ్ కంటికి ఆపరేషన్..

Published on

-Advertisement-

మన భారత్, హైదరాబాద్: 

‘పెద్ది’ చిత్ర షూటింగ్ సందర్భంగా జరిగిన చిన్న ప్రమాదంలో హీరో రాంచరణ్ కంటి రెప్ప పైభాగంలో గాయపడిన విషయం తెలిసిందే. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో ఈ ఘటన చోటు చేసుకోగా, వెంటనే వైద్య చికిత్స అందించడంతో ప్రమాదం తప్పింది.

ఈ నేపథ్యంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ సుధాకర్ ప్రసాద్‌కు మెగాస్టార్ Chiranjeevi ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తన సోషల్ మీడియా ద్వారా స్పందించిన చిరంజీవి, “మీరు నైపుణ్యంతో చేసిన ఆపరేషన్ మాకు నిజంగా ఓ వరంలాంటిది. ఆ సమయంలో మేమెంతో ఆందోళన చెందినా మీ ప్రతిభ దానిని తొలగించింది. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.

రామ్ చరణ్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి ప్రమాదం లేకుండా కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో అభిమానులు ఆందోళన చెందగా, తాజా సమాచారం వారికి ఊరటనిచ్చింది.

సినిమా షూటింగ్‌ల సమయంలో భద్రతా చర్యలు ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. చిత్ర యూనిట్ కూడా ఇకపై మరింత జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపింది.

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this