మన భారత్, హైదరాబాద్:
‘పెద్ది’ చిత్ర షూటింగ్ సందర్భంగా జరిగిన చిన్న ప్రమాదంలో హీరో రాంచరణ్ కంటి రెప్ప పైభాగంలో గాయపడిన విషయం తెలిసిందే. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో ఈ ఘటన చోటు చేసుకోగా, వెంటనే వైద్య చికిత్స అందించడంతో ప్రమాదం తప్పింది.

ఈ నేపథ్యంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ సుధాకర్ ప్రసాద్‌కు మెగాస్టార్ Chiranjeevi ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తన సోషల్ మీడియా ద్వారా స్పందించిన చిరంజీవి, “మీరు నైపుణ్యంతో చేసిన ఆపరేషన్ మాకు నిజంగా ఓ వరంలాంటిది. ఆ సమయంలో మేమెంతో ఆందోళన చెందినా మీ ప్రతిభ దానిని తొలగించింది. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.

రామ్ చరణ్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి ప్రమాదం లేకుండా కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో అభిమానులు ఆందోళన చెందగా, తాజా సమాచారం వారికి ఊరటనిచ్చింది.

సినిమా షూటింగ్‌ల సమయంలో భద్రతా చర్యలు ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. చిత్ర యూనిట్ కూడా ఇకపై మరింత జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపింది.

