కొత్త ఫైర్ స్టేషన్‌కు గ్రీన్ సిగ్నల్.!

Published on

-Advertisement-

మన భారత్ ,ఆదిలాబాద్: బోథ్ మండల కేంద్రంలో కొత్త ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం స్థానిక ప్రజల్లో ఆనందాన్ని కలిగించింది. ఈ విషయాన్ని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ వెల్లడించారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం కీలకమని ఆయన పేర్కొన్నారు.

ఫైర్ స్టేషన్ మంజూరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ చారి కీలక పాత్ర పోషించినట్లు గజేందర్ తెలిపారు. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అనేకసార్లు ధర్నాలు, వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఫైర్ స్టేషన్ మంజూరు కాలేదని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే స్పందించిందని పేర్కొన్నారు.

ఈ ఫైర్ స్టేషన్ కోసం మొత్తం 18 మంది సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో స్టేషన్ ఫైర్ ఆఫీసర్, లీడింగ్ ఫైర్‌మన్, డ్రైవర్ ఆపరేటర్, ఫైర్‌మన్, జూనియర్ అసిస్టెంట్, స్వీపర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ యూనిట్ నిర్వహణ కోసం సంవత్సరానికి సుమారు రూ.110.46 లక్షల వ్యయం అంచనా వేయగా, ప్రారంభ ఏర్పాట్ల కోసం రూ.303.35 లక్షల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

ఈ ఫైర్ స్టేషన్ ఏర్పాటు వల్ల బోథ్ మరియు పరిసర ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల సమయంలో తక్షణ సేవలు అందించేందుకు వీలు కలుగుతుందని, ప్రజల ప్రాణాలు మరియు ఆస్తులను కాపాడడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Latest articles

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యం

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలన -సర్పంచ్ నైనకంటి మమత మన భారత్,మొగుళ్ళపల్లి: పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలనను కొనసాగిస్తున్నామని, పల్లెలు...

ఉద్యమకారుల జేఏసీ మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడిగా చదువు అన్నారెడ్డి మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల...

రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం..

విద్యార్థులపై లాఠీచార్జ్ ,రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం -మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి...

ముగ్గురిపై కేసు నమోదు..

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పర్లపల్లి గ్రామంలో ఎస్ఐ ముప్పు సురేష్ నేతృత్వంలో పోలీస్...

More like this