మన భారత్, సంసృతి:
మన భారతీయ సంప్రదాయాల్లో తెలుగు పంచాంగానికి ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా మనం గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం పుట్టిన సంవత్సరం గుర్తుంచుకుంటాం. కానీ అదే సంవత్సరం తెలుగు పంచాంగంలో ఏ పేరుతో ఉందో చాలామందికి తెలియదు. అందుకే ఈ వివరాలు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా అందిస్తున్నాం.

60 సంవత్సరాల చక్రం – సంప్రదాయ ప్రత్యేకత
తెలుగు సంవత్సరాలు మొత్తం 60 పేర్లతో ఒక చక్రంలా తిరుగుతాయి. ఈ చక్రం ప్రాచీన కాలం నుంచి కొనసాగుతోంది. ప్రతి 60 సంవత్సరాల తర్వాత మళ్లీ అదే పేర్లు పునరావృతం అవుతాయి. ఉదాహరణకు 1867, 1927, 1987 సంవత్సరాలు “ప్రభవ” సంవత్సరానికి చెందుతాయి.

మీ పుట్టిన తెలుగు సంవత్సరం ఎలా తెలుసుకోవాలి?
కింద ఇవ్వబడిన జాబితాలో మీ పుట్టిన సంవత్సరం చూసి, దానికి సరిపోయే తెలుగు సంవత్సరం పేరు తెలుసుకోవచ్చు:
*ప్రభవ: (1867, 1927, 1987)
*విభవ: (1868, 1928, 1988)
* శుక్ల: (1869, 1929, 1989)
* ప్రమోదూత: (1870, 1930, 1990)
* ప్రజోత్పత్తి: (1871, 1931, 1991)
* అంగీరస: (1872, 1932, 1992)
* శ్రీముఖ: (1873, 1933, 1993)
* భావ: (1874, 1934, 1994)
* యువ: (1875, 1935, 1995)
* ధాత: (1876, 1936, 1996)
* ఈశ్వర: (1877, 1937, 1997)
* బహుధాన్య: (1878, 1938, 1998)
* ప్రమాది: (1879, 1939, 1999)
* విక్రమ: (1880, 1940, 2000)
* వృష: (1881, 1941, 2001)
* చిత్రభాను: (1882, 1942, 2002)
* స్వభాను: (1883, 1943, 2003)
* తారణ: (1884, 1944, 2004)
* పార్థివ: (1885, 1945, 2005)
* వ్యయ: (1886, 1946, 2006)
* సర్వజిత్: (1887, 1947, 2007)
* సర్వదారి: (1888, 1948, 2008)
* విరోది: (1889, 1949, 2009)
* వికృతి: (1890, 1950, 2010)
* ఖర: (1891, 1951, 2011)
* నందన: (1892, 1952, 2012)
* విజయ: (1893, 1953, 2013)
* జయ: (1894, 1954, 2014)
* మన్మద: (1895, 1955, 2015)
* దుర్ముఖి: (1896, 1956, 2016)
* హేవిళంబి: (1897, 1957, 2017)
* విళంబి: (1898, 1958, 2018)
* వికారి: (1899, 1959, 2019)
* శార్వరి: (1900, 1960, 2020)
* ప్లవ: (1901, 1961, 2021)
* శుభకృత్: (1902, 1962, 2022)
* శోభకృత్: (1903, 1963, 2023)
* క్రోధి: (1904, 1964, 2024)
* విశ్వావసు: (1905, 1965, 2025)
* పరాభవ: (1906, 1966, 2026)
* ప్లవంగ: (1907, 1967, 2027)
* కీలక: (1908, 1968, 2028)
* సౌమ్య: (1909, 1969, 2029)
* సాధారణ: (1910, 1970, 2030)
* విరోదికృత్: (1911, 1971, 2031)
* పరీదావి: (1912, 1972, 2032)
* ప్రమాది: (1913, 1973, 2033)
* ఆనంద: (1914, 1974, 2034)
* రాక్షస: (1915, 1975, 2035)
* నల: (1916, 1976, 2036)
* పింగళ: (1917, 1977, 2037)
* కాళయుక్తి: (1918, 1978, 2038)
* సిద్ధార్థి: (1919, 1979, 2039)
* రౌద్రి: (1920, 1980, 2040)
* దుర్మతి: (1921, 1981, 2041)
* దుందుభి: (1922, 1982, 2042)
* రుదిరోద్గారి: (1923, 1983, 2043)
* రక్తాక్షి: (1924, 1984, 2044)
* క్రోధన: (1925, 1985, 2045)
* అక్షయ: (1926, 1986, 2046)

సంప్రదాయాన్ని తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం?
తెలుగు సంవత్సరాలు కేవలం పేర్లు మాత్రమే కాదు, మన సంస్కృతి, సంప్రదాయం, కాలగమనానికి ప్రతీకలు. ఉగాది రోజున కొత్త సంవత్సరం పేరు ప్రకటించడం కూడా ఇదే సంప్రదాయానికి భాగం. అందుకే ప్రతి ఒక్కరూ తమ పుట్టిన తెలుగు సంవత్సరం తెలుసుకోవడం ద్వారా సంస్కృతిపై మరింత అవగాహన పెంచుకోవచ్చు.

