హార్ముజ్ ఉద్రిక్తతల నడుమ భారత్‌కు LPG

Published on

-Advertisement-

మన భారత్, న్యూఢిల్లీ: 

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా హార్ముజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన నౌకల్లో రెండు భారతదేశానికి రానున్నాయని సమాచారం. LPG సరుకు మోస్తున్న పైన్ గ్యాస్ మరియు జగ్ వసంత్ అనే నౌకలు ప్రస్తుతం యూఏఈలోని షార్జా తీరానికి సమీపంలో నిలిచివున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే ఇవి నేటి నుంచే భారత జెండాతో ప్రయాణం ప్రారంభించే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

గత వారం ఇరాన్ అదుపులోకి తీసుకున్న రెండు LPG నౌకలను విడుదల చేయడంతో అవి సురక్షితంగా భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం షార్జా వద్ద ఉన్న నౌకలకు కూడా ఎలాంటి అడ్డంకులు ఉండకపోవచ్చని ఇండియన్ నౌకాయాన వర్గాలు అంచనా వేస్తున్నాయి.

దేశంలో LPG సరఫరాపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ, ఈ రెండు నౌకలు చేరుకుంటే గ్యాస్ కొరత కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా గృహ వినియోగం, పరిశ్రమల అవసరాలకు LPG సరఫరా స్థిరపడటంలో ఇది సహాయకారిగా మారనుంది.

హార్ముజ్ జలసంధి అంతర్జాతీయంగా కీలక వాణిజ్య మార్గంగా ఉండటంతో అక్కడి పరిస్థితులను భారత్ సన్నిహితంగా గమనిస్తోంది. భవిష్యత్‌లో సరఫరా అంతరాయం లేకుండా చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this