హార్ముజ్ ఉద్రిక్తతల నడుమ భారత్‌కు LPG
మన భారత్, న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా హార్ముజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన నౌకల్లో రెండు భారతదేశానికి రానున్నాయని సమాచారం. LPG సరుకు మోస్తున్న పైన్ గ్యాస్ మరియు జగ్ వసంత్ అనే నౌకలు ప్రస్తుతం యూఏఈలోని షార్జా తీరానికి సమీపంలో నిలిచివున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే ఇవి నేటి నుంచే భారత జెండాతో ప్రయాణం ప్రారంభించే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. గత వారం ఇరాన్ అదుపులోకి తీసుకున్న రెండు LPG నౌకలను...