పేదల సంక్షేమం కాంగ్రెస్ సర్కారుతో సాధ్యం..

Published on

-Advertisement-

 మన భారత్ ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇండ్లను మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.

మండలంలోని బరంపూర్ గ్రామంలో రత్నాల ప్రవీణ్, భూమన్నలకు నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. అలాగే రుయ్యడి గ్రామంలో త్యపల్ల హన్మంత్, అలాలి లక్ష్మి, పోతారాజు లక్ష్మిలకు నిర్మించిన ఇండ్లకు గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బరంపూర్ గ్రామ సర్పంచ్ మెస్రం దేవురావ్, రుయ్యడి గ్రామ సర్పంచ్ ఉడుగు రాకేష్‌లతో కలిసి మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ పథకాల ద్వారా పేద కుటుంబాలు స్వంత ఇళ్ల కలను సాకారం చేసుకుంటున్నాయని, కాంగ్రెస్ సర్కార్ తోనే పేదల సంక్షేమం సాధ్యం అని ఆయన పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే అర్హులైన కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణం జరుగుతుండటం ఆనందకరమని ఆయన అన్నారు. భవిష్యత్తులో మరింత మంది పేదలకు ఇళ్ల సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పల్లి బి సర్పంచ్ కె. సంజీవ్, గ్రామ సెక్రటరీ అనిల్ రెడ్డి, ఉప సర్పంచ్‌లు రంజిత్ రెడ్డి, కె. వెంకటేష్, వార్డ్ సభ్యులు జె. ఉత్తమ్, ఎన్. అశోక్, ఎస్. రమాకాంత్ పాల్గొన్నారు. అలాగే నాయకులు కె. ప్రతాప్, ఎన్. గంగాధర్, కె. విట్టల్, ఎల్. ప్రవీణ్ రెడ్డి, టి. గంగారెడ్డి, నర్సయ్య, మోహన్, బాపూరావ్ తదితరులు హాజరై లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు.

గ్రామాల్లో గృహప్రవేశ కార్యక్రమాలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.

Latest articles

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యం

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలన -సర్పంచ్ నైనకంటి మమత మన భారత్,మొగుళ్ళపల్లి: పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలనను కొనసాగిస్తున్నామని, పల్లెలు...

ఉద్యమకారుల జేఏసీ మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడిగా చదువు అన్నారెడ్డి మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల...

రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం..

విద్యార్థులపై లాఠీచార్జ్ ,రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం -మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నడిగోటి...

ముగ్గురిపై కేసు నమోదు..

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పర్లపల్లి గ్రామంలో ఎస్ఐ ముప్పు సురేష్ నేతృత్వంలో పోలీస్...

More like this