పేదల సంక్షేమం కాంగ్రెస్ సర్కారుతో సాధ్యం..
మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇండ్లను మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. మండలంలోని బరంపూర్ గ్రామంలో రత్నాల ప్రవీణ్, భూమన్నలకు నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. అలాగే రుయ్యడి గ్రామంలో త్యపల్ల హన్మంత్, అలాలి లక్ష్మి, పోతారాజు లక్ష్మిలకు నిర్మించిన ఇండ్లకు గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...