60 ఏళ్ల వయసులోనూ 20లా కనిపిస్తున్న మోడల్ 

Published on

-Advertisement-

మన భారత్, సింగపూర్: 

వయస్సు పెరిగినా అందం, ఫిట్‌నెస్ కాపాడుకోవడం సాధ్యమేనని మరోసారి నిరూపించారు సింగపూర్‌కు చెందిన ప్రముఖ మోడల్ Chuando Tan. ఈ నెల 3న ఆయన 60వ పుట్టినరోజు జరుపుకున్నప్పటికీ, ఆయన లుక్స్ చూసి చాలా మంది ఇప్పటికీ 20–30 ఏళ్ల యువకుడని భావిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన ఫిట్‌నెస్, యవ్వన లుక్ గురించి సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది.

చువాండో టాన్ తన ఆకర్షణీయమైన లుక్, ఫిట్ బాడీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆ ఫొటోలు చూసిన నెటిజన్లు “అరవైలో ఇరవైలా ఉన్నారు”, “ఇంత యవ్వనంగా ఎలా ఉంటారు?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు సరదాగా “ఇతను వ్యాంపైర్ అయి ఉండొచ్చు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

తన యవ్వనానికి కారణం క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అని చువాండో టాన్ చెబుతున్నారు. ముఖ్యంగా హై ప్రొటీన్ ఆహారం తీసుకోవడం, మద్యం, ధూమపానం, చక్కెరకు పూర్తిగా దూరంగా ఉండడం ఆయన పాటించే ముఖ్యమైన అలవాట్లు. అదనంగా ప్రతిరోజూ వ్యాయామం చేయడం, తరచూ స్విమ్మింగ్ చేయడం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుందని ఆయన వెల్లడించారు.

ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తే వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని చువాండో టాన్ మరోసారి నిరూపించారు. ఆయన ఫిట్‌నెస్, యవ్వన లుక్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి ప్రేరణగా నిలుస్తోంది.

Latest articles

విద్యా కమిషన్ ప్రతిపాదనలపై టీఆర్ఎస్ ఆందోళన..

ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం.. విద్యా కమిషన్ ప్రతిపాదనలపై తెలంగాణ రక్షణ సేన ఆందోళన మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో...

రైతులు ప్రజల రక్షణే ప్రభుత్వ లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్  వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి: ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి ఆదిలాబాద్, జూలై 21: రైతుల సంక్షేమం,...

నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా..

మన భారత్, ఆదిలాబాద్ నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా.. భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్,...

రైతులకు నీళ్లు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్: కల్వకుంట్ల కవిత

రైతులకు నీళ్లు ఇవ్వకుండా రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వం: టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపణ మన భారత్, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజ్‌తో...

More like this