ఆదిలాబాద్ 17వ వార్డులో ఎంఐఎం కిషోర్ జాదవ్ గెలుపు

Published on

-Advertisement-

మన భారత్ ఆదిలాబాద్:

ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 17వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి కిషోర్ జాదవ్ విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఆయనకు మొత్తం 926 ఓట్లు లభించాయి.

తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 341 ఓట్ల మెజారిటీతో కిషోర్ జాదవ్ విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

ప్రజలు అభివృద్ధి, సేవా భావాన్ని గుర్తించి మద్దతు ఇచ్చారని కిషోర్ జాదవ్ తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారం, రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాల మెరుగుదలపై కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ విజయంతో ఆదిలాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో ఎంఐఎం ప్రభావం మరింత పెరిగినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Latest articles

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...

ట్రాఫిక్ సమస్యల నివారణకు కృషి..

మొగుళ్లపల్లి, మన భారత్: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది....

More like this