రాష్ట్రంలో ఐదుగురు డీఎస్పీల బదిలీకి ఉత్తర్వులు..

Published on

-Advertisement-

మన భారత్, హైదరాబాద్:

రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక బదిలీలు చోటు చేసుకున్నాయి. ఐదుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ బి. శివధర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాలు, పనితీరు మెరుగుదల లక్ష్యంగా ఈ బదిలీలు చేపట్టినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.

రాష్ట్ర పోలీస్ అకాడమీ స్టాండ్స్ డీఎస్పిగా, అలాగే ఇల్లందు ఎన్‌ఆర్‌పీఓగా విధులు నిర్వహిస్తున్న ఎస్. సారంగపాణిని వైరా ఏసీపీగా బదిలీ చేశారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో డీఎస్పిగా పని చేస్తున్న పద్మనాభుల శ్రీనివాస్‌ను జీహెచ్‌ఎంసీ అదనపు ఎస్పిగా నియమించారు.

ఇంటెలిజెన్స్ డీఎస్పిగా విధులు నిర్వహిస్తున్న యు. వెంకన్నబాబును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎస్‌డీపీఓగా బదిలీ చేశారు. సైబరాబాద్ ఎస్‌బీ ఏసీపీగా ఉన్న బి. ప్రకాష్‌ను నిజామాబాద్ ఏసీపీగా నియమించారు. ప్రస్తుతం నిజామాబాద్ ఏసీపీగా ఉన్న ప్రకాష్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ బదిలీలతో రాష్ట్ర పోలీస్ విభాగంలో పరిపాలనా పనితీరు మరింత సమర్థవంతంగా సాగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this