సంక్రాంతి రద్దీకి స్పెషల్ బస్సులు.. పెరిగిన ఛార్జీలు అమల్లోకి

Published on

-Advertisement-

సంక్రాంతి రద్దీకి స్పెషల్ బస్సులు.. పెరిగిన ఛార్జీలు అమల్లోకి

మన భారత్, తెలంగాణ: 

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సవరించినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రకటించింది. 2003లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల (జీవో) ప్రకారం టికెట్ ధరపై గరిష్టంగా 1.5 రెట్లు వరకు ఛార్జీలు పెంచినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఈ నిర్ణయం మేరకు ప్రస్తుతం రూ.100గా ఉన్న టికెట్ ధర రూ.150కు పెరగనుంది. అయితే ఈ పెంపు సాధారణ బస్సులకు కాకుండా, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు నడిచే స్పెషల్ బస్సులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.

ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లో ముందస్తు ప్రయాణ రద్దీ దృష్ట్యా, అలాగే తిరుగు ప్రయాణాలు అధికంగా ఉండే 18, 19 తేదీల్లో మాత్రమే పెరిగిన ఛార్జీలు అమల్లో ఉంటాయని టీజీఎస్‌ఆర్టీసీ వివరించింది. ప్రయాణికులు ముందుగానే ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని, ఆన్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

పండుగ వేళ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, భద్రతతో పాటు సమయపాలనకు ప్రాధాన్యం ఇస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Latest articles

ప్రతి గింజ కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా...

హైడ్రాను తొలగిస్తాం’.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్...

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...

అలెర్ట్.. 5 రోజులు వర్ష సూచన

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న ఐదు రోజులపాటు పలు...

More like this