ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం..

Published on

-Advertisement-

చాంద గ్రామంలో మున్నూరు కాపు ప్రతినిధుల ఘన విజయం – నూతన సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు ఘన సన్మానం

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని చాంద గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మున్నూరు కాపు సమాజానికి చెందిన నాయకులు ఘన విజయం సాధించారు. చాంద గ్రామానికి చెందిన కస్తూరి మంజూష అఖిలేష్ సర్పంచ్‌గా, గండ్రత్ వినోద శ్రీనివాస్ ఉపసర్పంచ్‌గా, అలాగే కస్తూరి స్వప్న సుభాష్ వార్డ్ మెంబర్‌గా ఎన్నికవడం పట్ల గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

ఈ విజయాన్ని పురస్కరించుకొని మున్నూరు కాపు మిత్రా సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు తోట శివన్న, ప్రధాన కార్యదర్శి బొల్లు ఈశ్వర్ దాస్, సభ్యులు జిమ్మ ఆడేల్లుతో పాటు చాంద గ్రామానికి చెందిన మున్నూరు కాపు కుల బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు మిఠాయిలు తినిపించి, శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పారదర్శక పాలనకు కృషి చేస్తామని ఈ సందర్భంగా నూతన సర్పంచ్ కస్తూరి మంజూష అఖిలేష్ తెలిపారు. ఉపసర్పంచ్ గండ్రత్ వినోద శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేస్తామని అన్నారు.

ఈ ఎన్నికల ఫలితాలు చాంద గ్రామంలో మున్నూరు కాపు సమాజానికి మరింత బలం చేకూర్చాయని, ఐక్యతతో గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.

Latest articles

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది: పవన్ కల్యాణ్

తెలంగాణకు అన్యాయం జరిగితే తొలి గొంతు జనసేనదే తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు.. తెలంగాణపై ప్రేమ, మమకారం ఉందన్న ఏపీ డిప్యూటీ...

నిరుద్యోగులను మోసం చేసిన వైసీపీకి డీఎస్సీపై మాట్లాడే అర్హత లేదు

డీఎస్సీ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే డీఎస్సీ: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ...

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం – ఆత్మగౌరవ పోరాటానికి విజయ చిహ్నం

మన భారత్ , ఆదిలాబాద్:  తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష, దశాబ్దాల పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ...

రవితేజ కష్టం ఫలించింది..!

అగ్నివీర్ ఫలితాల్లో సత్తా చాటిన కౌఠ (బీ) గ్రామానికి చెందిన రవితేజ యువతకు ఆదర్శంగా నిలిచిన గ్రామీణ ప్రతిభ మన భారత్,...

More like this