దేవాలయ భూముల సంరక్షణకు రేవంత్ సర్కారు సిద్ధం.. కొత్త బిల్లు రాబోతోంది

Published on

-Advertisement-

దేవాలయ భూముల సంరక్షణకు రేవంత్ సర్కారు సిద్ధం — కొత్త బిల్లు రాబోతోంది
ఆక్రమణదారుల పై ఉక్కుపాదం మోపేందుకు సర్కారు సన్నాహాలు

మన భారత్, హైదరాబాద్, నవంబర్ 1:
తెలంగాణ రాష్ట్రంలో దేవాలయ భూముల రక్షణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ, చారిటబుల్ ట్రస్టులకు చెందిన భూములు ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో, వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కొత్త చట్టబద్ధ మార్గం ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్, 1987లోని చాప్టర్ XIలో సవరణలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సెక్షన్ 83, 84లను రద్దు చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం రూపొందించింది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.

సర్కారు వర్గాల సమాచారం ప్రకారం, ట్రిబ్యునల్, కోర్టు కేసుల పేరిట వేల ఎకరాల దేవాలయ భూములను ఆక్రమించి ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఈ బిల్లు దోహదం కానుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వందల ఎకరాలు ఆక్రమణకు గురవ్వడంతో, వాటిని తిరిగి దేవాలయాల అధీనంలోకి తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది.

దేవాలయ భూముల విలువ వేల కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. ఈ భూములు మళ్లీ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ఉపయోగపడేలా సర్కారు నడుంబిగించింది. ఎండోమెంట్స్ అధికారులకు ప్రత్యేకాధికారాలు కల్పిస్తూ, అవసరమైతే పోలీసు, హైడ్రా సహకారంతో ఆక్రమణలు తొలగించే అవకాశమూ ఉంది.

మతపరమైన సంస్థల ప్రతినిధులు, హిందూ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. “దశాబ్దాలుగా ఆక్రమణదారుల చేతుల్లో చిక్కుకున్న దేవాలయ భూములను తిరిగి సంపాదించడం సమాజ ధర్మం” అని పలువురు అభిప్రాయపడ్డారు.

Latest articles

వడ దెబ్బతో కూలీ మృతి ..

మన భారత్ , ఆదిలాబాద్:  జిల్లాలోని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్న వేళ వడ దెబ్బ కారణంగా మరో విషాదం చోటుచేసుకుంది....

గ్రామస్థాయిలో సేవలందించే సైనికులే అంగన్వాడీలు..

మన భారత్, మొగుళ్ళపల్లి: అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలందించే నిజమైన సైనికులని జిల్లా కలెక్టర్...

ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు..

మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు సుకుమార్‌పై విద్యార్థులపై అసభ్య ప్రవర్తనకు సంబంధించిన...

నాణ్యత లేని సీసీ రోడ్డు.. పగుళ్లతో బయటపడిన నిర్లక్ష్యం

మన భారత్, ఆదిలాబాద్: మండలంలోని పొన్నారి గ్రామంలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డు నాణ్యతపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం...

More like this