e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణోత్సవాలు..

జైనథ్‌లో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణోత్సవాలు.. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 5 వరకు ఘనంగా జాతర

మన భారత్, జైనథ్: నవంబర్ 24, ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు, జాతర, రథోత్సవాలను పురస్కరించుకొని ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి, అర్చకులు, సిబ్బంది ఆహ్వాన పత్రిక ద్వారా వెల్లడించారు. ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.

నవంబర్ 20 నుంచి ఉత్సవాలకు శ్రీకారం

నవంబర్ 20వ తేదీన విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, అంకురారోపణం, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. నవంబర్ 21న నిత్యహవనం, ధ్వజారోహణం, బలిహరణం, నగర భోజనం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి 8 గంటలకు శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరగనుంది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ ఉంటుంది.

వాహన సేవలతో ఆధ్యాత్మిక సందడి

నవంబర్ 22న హవనం, బలిహరణం, తీర్థప్రసాద వినియోగం నిర్వహిస్తారు. నవంబర్ 23న నిత్యహవనం, బలిహరణం, తీర్థప్రసాదాల పంపిణీ జరుగుతుంది. నవంబర్ 24న సాయంత్రం 7 గంటలకు బలిహరణం, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, శేషవాహన సేవ నిర్వహించనున్నారు.

నవంబర్ 25న శేష హోమం, బలిహరణం అనంతరం రాత్రి 8 గంటలకు గజవాహన సేవతో స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తారు. నవంబర్ 26న బలిహరణం అనంతరం రాత్రి 8 గంటలకు అశ్వవాహన సేవ, స్వామివారి ఊరేగింపు జరగనుంది. నవంబర్ 27న ఉదయం 9 గంటలకు బలిహరణం, హనుమత్ వాహన సేవ నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు.

నవంబర్ 28న అఖండ జ్యోతి, గరుడ వాహన సేవ

నవంబర్ 28న ఉదయం 9 గంటలకు బలిహరణం, తీర్థప్రసాద వినియోగం నిర్వహించనున్నారు. సాయంత్రం 7 గంటలకు అఖండ జ్యోతి ప్రజ్వలన, రాత్రి 8 గంటలకు గరుడ వాహన సేవ (పొన్నచెట్టు సేవ) నిర్వహించనున్నారు.

నవంబర్ 29న వైభవంగా రథోత్సవం

ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన నవంబర్ 29వ తేదీన ఉదయం 9 గంటలకు బలిహరణం, తీర్థప్రసాద వినియోగం, వ్రత ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం పెద్ద రథంపై స్వామివారిని అధిష్ఠింపజేసి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. స్వామివారి ఊరేగింపు, నాగబలి, పుష్పయాగం, గ్రామబలి, ఉద్వాసన తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి.

సంతానం కోరుకునే మహిళలకు గరుడ ప్రసాదం

నవంబర్ 21న స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా రాత్రి 7:30 గంటలకు సంతానం కోరుకునే మహిళలకు సంప్రదాయం ప్రకారం గరుడ ప్రసాదం (గరుడ ముద్ద) అందించనున్నట్లు ఆలయ ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు.

ఈ ఉత్సవాలను పురస్కరించుకొని నవంబర్ 29 నుంచి డిసెంబర్ 5 వరకు జాతర నిర్వహించనున్నారు. భక్తులు, పరిసర గ్రామాల ప్రజలు కుటుంబ సమేతంగా హాజరై స్వామివారి కళ్యాణోత్సవాలు, వాహన సేవలు, రథోత్సవంలో పాల్గొనాలని ఆలయ ధర్మకర్తల మండలి, అర్చకులు, సిబ్బంది ఆహ్వానించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE