e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా సోషల్ మీడియా, ఐటీ ఇన్‌చార్జిగా దుర్ల సురేష్ నియామకం

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా సోషల్ మీడియా, ఐటీ ఇన్‌చార్జిగా దుర్ల సురేష్ నియామకం

మన భారత్, జైనథ్:నవంబర్ 16,

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎస్సీ మోర్చా ఆదిలాబాద్ జిల్లా సోషల్ మీడియా, ఐటీ ఇన్‌చార్జిగా జైనథ్ మండల పరిధిలోని ఖప్రి గ్రామానికి చెందిన దుర్ల సురేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి అభినందనలు తెలిపారు.

బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానందం, అధ్యక్షులు దేవన్న, ఫోక్ పర్సన్ శైలేందర్, జిల్లా కార్యదర్శి దురంపల్, దుర్ల అనిల్, బిక్కి వచ్చన్న తదితర నాయకులు దుర్ల సురేష్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ సంస్థాగత బలోపేతానికి సోషల్ మీడియా, ఐటీ విభాగం కీలకమని పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, పార్టీ విధానాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ ఎస్సీ మోర్చా అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

తనకు ఈ బాధ్యత అప్పగించిన పార్టీ నాయకులకు దుర్ల సురేష్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి, ఎస్సీ మోర్చా బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE