e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

డిల్లిలో కాంగ్రెస్ శ్రేణుల భారీ పాదయాత్ర..

ఓటు హక్కు పరిరక్షణ కోసం ఢిల్లీలో ఆదిలాబాద్ కాంగ్రెస్ శ్రేణుల భారీ పాదయాత్ర
తెలంగాణ భవన్ నుంచి రామ్‌లీలా మైదానం వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ప్రదర్శన
డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ నాయకత్వంలో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా నేతలు

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 1, ఓటు హక్కు సంరక్షణ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ జాతీయ కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు సంఘీభావం ప్రకటించాయి. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పిలుపు మేరకు న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ ర్యాలీలో పాల్గొనేందుకు ఆదిలాబాద్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి తరలివెళ్లారు.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ నాయకత్వంలో న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి రామ్‌లీలా మైదానం వరకు భారీ పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జెండాలు చేతబూని నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలనే నినాదంతో సాగిన ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా నాయకుల భాగస్వామ్యం కనిపించింది.

ఈ పాదయాత్రలో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యుడు సోయం బాపురావు, ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆత్రం సుగుణ, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ గణేష్ రెడ్డి పాల్గొన్నారు.

అలాగే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అన్నపూర్ణ, శ్రీలేఖ, సంగీత, అనసూయ, షబానా, జుబేడా, డేరా కృష్ణారెడ్డి, దుర్గం శేఖర్, పరమేశ్వర్, మల్లేష్, గౌలి సంజయ్, గుడిపల్లి నగేష్, సురేష్‌తో పాటు వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, పీఏసీ సభ్యులు, డీసీసీ సభ్యులు, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో కీలకమైనదని పేర్కొన్నారు. ఆ హక్కును కాపాడేందుకు రాహుల్ గాంధీ చేపడుతున్న పోరాటానికి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, ఓటరు జాబితాల సవరణలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటర్ల పేర్ల తొలగింపునకు సంబంధించి తాము వ్యక్తం చేస్తున్న ఆందోళనలను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య హక్కుల సాధన కోసం చేపట్టిన ఈ జాతీయ ఉద్యమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగుతారని తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన పాదయాత్రలో ఆదిలాబాద్ జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ద్వారా పార్టీ కార్యక్రమానికి తమ సంఘీభావాన్ని చాటారని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE