e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

అఖండ భారత దేశ నిర్మాణానికి విశేష కృషి చేసిన ఉక్కుమనిషి సర్దార్ పటేల్ : వేముల మహేందర్ గౌడ్

మొగుళ్ళపల్లి అక్టోబర్ 31,( మన భారత్):  స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ ఉప తొలి ప్రధాని, భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. శనివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, దేశంలోని వందలాది సంస్థానాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి అఖండ భారతదేశ నిర్మాణానికి విశేష కృషి చేసిన ఉక్కుమనిషి సర్దార్ పటేల్ అని మహేందర్ గౌడ్ కొనియాడారు. సర్దార్ పటేల్ సేవలను స్మరిస్తూ..ఆయన జయంతిని పురస్కరించుకొని నిర్వహించే ‘జాతీయ ఐక్యతా దినోత్సవం’ సందర్భంగా దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు పునరంకితం కావాలని మహేందర్ గౌడ్ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE