e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి

సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి
దేశ సమైక్యతకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం: కళాశాల ప్రిన్సిపాల్

మన భారత్, తాంసి, అక్టోబర్ 31: భారతదేశ తొలి ఉప ప్రధాని, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని తాంసి మండల కేంద్రంలోని కళాశాలలో మై భారత్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించడంతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్ర, దేశ సమైక్యత కోసం ఆయన చేసిన సేవలు, నాయకత్వ లక్షణాలను వివరించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. ఉదయ భాస్కర్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యత, సమగ్రత కోసం చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని సంస్థానాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి జాతీయ సమైక్యతకు బలమైన పునాది వేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన జీవితంలోని క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావం, నాయకత్వ లక్షణాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక బాధ్యతను అలవర్చుకుని ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

అనంతరం ప్రభుత్వం నుంచి విద్యార్థులకు మంజూరైన యూనిఫామ్‌లను గ్రామ సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించడం, విద్య పట్ల ఆసక్తిని పెంపొందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మై భారత్ వాలంటీర్ చంద్రకాంత్, యూత్ లీడర్లు రామ్, శశికుమార్, రాజేందర్, ఏజీఎంఈ శ్రీ, క్లస్టర్ కో-ఆర్డినేటర్ మహేందర్, కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. ఉదయ భాస్కర్, కళాశాల బోధన సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE