e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

కేటీఆర్ సభను విజయవంతం చేయాలి..

బోథ్ నియోజకవర్గ కార్యకర్తలకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దిశానిర్దేశం

మన భారత్, నేరడిగొండ: అక్టోబర్ 30, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నవంబర్ 1వ తేదీన నిర్వహించనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన, రైతు గర్జన సభను విజయవంతం చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నియోజకవర్గ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నేరడిగొండ మండల కేంద్రంలో బోథ్ నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమై సభ నిర్వహణ, జన సమీకరణపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. ఇటీవల తలమడుగు మండలంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం, నవంబర్ 1న ఆదిలాబాద్‌లో జరిగే కేటీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న ఈ సభకు ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు.

బోథ్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో సభకు తరలిరావాలని కోరారు. గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు సభ వివరాలను తెలియజేయాలని సూచించారు.

నవంబర్ 1న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే కేటీఆర్ పర్యటన సందర్భంగా జిల్లా అంతటా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, వివిధ మండలాల పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE