రైతులకు ఉచితంగా ఆగ్రో ఫారెస్ట్రీ మొక్కల పంపిణీ
రైతులకు ఉచితంగా ఆగ్రో ఫారెస్ట్రీ మొక్కల పంపిణీ మన భారత్, తలమడుగు: అక్టోబర్ 26, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ కేశవపూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతులకు ఆగ్రో ఫారెస్ట్రీపై అవగాహన కల్పిస్తూ ఉచితంగా వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పండ్ల తోటల పెంపకానికి ఉపయోగపడే పలు రకాల మొక్కలను రైతులకు అందజేశారు. వాతావరణ పరిస్థితుల్లో చోటుచేసుకుంటున్న మార్పులు, వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటితో సాగు...