e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 24, 2026

ఇంటి తాళం పగులగొట్టి చోరీ.. నిందితుడి అరెస్ట్

మూడు తులాల వెండి పట్టీలు, రూ.10,130 నగదు స్వాధీనం.. ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్ కూడా సీజ్

మన భారత్, తలమడుగు, ఆదిలాబాద్ జిల్లా, అక్టోబర్ 24:
తాళమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో ఇంటి తాళం పగులగొట్టి వెండి పట్టీలు, నగదు చోరీ చేసిన కేసులో నిందితుడిని తాళమడుగు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి చోరీకి గురైన మూడు తులాల వెండి పట్టీలు, రూ.10,130 నగదు, హోండా యాక్టివా ద్విచక్ర వాహనం, రెడ్‌మీ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తాళమడుగు ఎస్‌హెచ్‌ఓ డి. రాధిక తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 21వ తేదీ రాత్రి దేవాపూర్ గ్రామంలో శారదాదేవి విగ్రహ నిమజ్జన ఊరేగింపు నిర్వహించారు. అదే సమయంలో గ్రామానికి చెందిన అంగ రాజు తన భార్య, పిల్లలతో కలిసి ఊరేగింపుకు వెళ్లాడు. కార్యక్రమం అనంతరం అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో ఇంటి తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించాడు.

ఇంట్లో పరిశీలించగా బీరువా తాళం కూడా ధ్వంసం చేసి ఉండటంతో పాటు బీరువాలో ఉంచిన మూడు తులాల వెండి పట్టీలు, రూ.15,000 నగదు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా తాళమడుగు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా శనివారం ఉదయం కజ్జర్ల ఎక్స్‌రోడ్డు సమీపంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులను గమనించిన ఓ వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతడిని ఆదిలాబాద్‌లోని కేఆర్‌కే కాలనీకి చెందిన మాకల రాజు (35), ప్రస్తుతం దేవాపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న వ్యక్తిగా గుర్తించారు.

పోలీసుల విచారణలో దేవాపూర్‌లో జరిగిన ఇంటి చోరీకి తానే పాల్పడినట్లు నిందితుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అతడి వద్ద నుంచి మూడు తులాల వెండి పట్టీలు, రూ.10,130 నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే చోరీకి ఉపయోగించినట్లు భావిస్తున్న హోండా యాక్టివా ద్విచక్ర వాహనం, రెడ్‌మీ సెల్‌ఫోన్‌ను కూడా పోలీసులు సీజ్ చేశారు. చోరీ చేసిన రూ.15,000 నగదులో కొంత మొత్తాన్ని ఇప్పటికే ఖర్చు చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు.

నిందితుడు మాకల రాజుపై గతంలోనూ దొంగతనం కేసులు నమోదైనట్లు ఎస్‌హెచ్‌ఓ డి. రాధిక తెలిపారు. కేసుకు సంబంధించిన తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెప్పారు.

ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలి

గ్రామాల్లో ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తాళమడుగు ఎస్‌హెచ్‌ఓ డి. రాధిక సూచించారు. ఇంట్లో విలువైన వస్తువులు, నగదు ఉంచే విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆమె సూచించారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE